Saturday, March 21, 2026
Homenewsకల్కి 2898 AD': నాగ్ అశ్విన్ రివీల్స్ మూడు ప్ర‌పంచాలు

కల్కి 2898 AD’: నాగ్ అశ్విన్ రివీల్స్ మూడు ప్ర‌పంచాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ విజువల్ వండర్‌ను అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘వ‌రల్డ్ ఆఫ్ కల్కి’ అనే వీడియో సిరీస్‌లో నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇప్పటికే ఎపిసోడ్-1 విడుదల కాగా, తాజా ఎపిసోడ్-2లో నాగ్ అశ్విన్ ‘కల్కి’ మూవీలోని మూడు ప్ర‌పంచాలను పరిచయం చేశాడు. ఈ సినిమాలో క‌లియుగం ముగిసిన త‌ర్వాత మిగిలిన ఆఖరి నగరంగా కాశీని డిజైన్ చేశారు. భ‌విష్య‌త్తులో కలగవచ్చిన పరిణామాలను కాశీ నగర రూపకల్పనలో చూపించారు. కాశీ పైన మరో ప్రపంచం కాంప్లెక్స్ ఉంటుంది, భూమిపై అంతరించిపోయినవన్నీ అక్కడ ఉంటాయి. ఇక, మూడో ప్ర‌పంచం శంబాల కూడా ఈ మూవీలో ఉంటుందని, దాన్ని ట్రైల‌ర్‌లో చూపించలేదని తెలిపారు. శంబాల కాశీ, కాంప్లెక్స్‌లకు భిన్నంగా ఉంటుంది, ఇది పూర్తిగా ఆధునికతను సూచిస్తుంది. శంబాల‌లో దేవుడిని బ్యాన్ చేస్తారు. శంబాల‌లో క‌ల్కి అవతారం పుడుతుంద‌ని న‌మ్ముతారు. ఈ మూడు ప్ర‌పంచాల‌ను క‌లిపే పాయింట్‌తో సినిమా కథ ముందుకు సాగుతుంద‌ని నాగ్ అశ్విన్ చెప్పారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS