ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్-2 నిర్వహణలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటమన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం జాబ్ కాలెండర్ మేరకు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏడాదిలోగా నోటిఫికేషన్లు విడుదల, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం భరోసా