Tuesday, April 1, 2025
Homenewsజైలు నుంచి విడుదలైన చంద్రబాబు

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

BY – సి. హెచ్. ఇజ్రాయేల్ యాదవ్

కరస్పాండెంట్.  
ఆంద్రప్రదేశ్.  (వర్డ్ ఆఫ్ ఇండియా)

తెలుగు రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన, తిరుగులేని నాయకుడిగా సుపరిచితుడైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకెల్లడం ఆంధ్రప్రదేశ్ రాజాకీయాలను తలక్రిందులు చేసిందనే చెప్పాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ లో ప్రధాన నిందితునిగా 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే గడిపారు.

అనంతరం ఈరోజున హైకోర్టు 5 షరతులతో కూడిన నాలుగు వారాల మంద్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు విడుదలతో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవటంతో రాజమండ్రి జైలు వద్ద సందడి వాతావరణం నెలకొన్నది.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల నివేదికలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ బెయిల్ మంజూరుని కోరుతూ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా, మరియు దమ్మాల పాటి శ్రీనివాస్ వారి వాదనలు వినిపించగ, నేర తీవ్రత ఎలాంటిదైనా వ్యక్తుల యొక్క ఆరోగ్యం చాలా కీలకమని, కేసు దర్యాప్తు సమయంలో కస్టడీ అనేది వ్యక్తికి శిక్షగా మారకూదడనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయటం గమనార్హం.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS