Tuesday, October 15, 2024
Homeతెలుగుతెలంగాణతెలంగాణ జాబ్ క్యాలెండర్ సిద్ధం

తెలంగాణ జాబ్ క్యాలెండర్ సిద్ధం

ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో ఈ క్యాలెండర్ రూపొందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల కారణంగా జాబ్ క్యాలెండర్ విడుదల ఆలస్యమైంది. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారులు శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించి, 18 వేల పోస్టులకు సంబంధించిన వివరాలతో జాబ్ క్యాలెండర్‌ను తయారు చేశారు.

 

ఈ క్యాలెండర్‌లో గ్రూప్-1, 2, 3, 4 పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులు, టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల వివరాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ప్రకటిస్తున్న జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 18 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీల టీచింగ్ పోస్టులను ఈ జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయడం లేదు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో ఉంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS