తెలంగాణలో పాఠశాలలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం, మరింత మెరుగైన భద్రతా చర్యలు
హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో కనీస అవసరాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను సజావుగా పునఃప్రారంభం చేయడంలో శ్లాఘనీయమైన చర్యలు తీసుకుంది. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంది.
టీజీ ఫుడ్ కమిషన్ సభ్యుడు వోరుగంటి ఆనంద్, పాఠశాలల్లో పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలను పాటించడని హైలైట్ చేశారు. తరగతి గదులు, హాస్టళ్లు, వంట సామగ్రి మరియు వాటర్ ట్యాంకులను వాడకానికి ముందు సమగ్రంగా శుభ్రం చేయాలని ఆయన అన్నారు. అదనంగా, పాత వంట సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించి పురుగు పట్టే ప్రమాదం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన మరియు పౌష్టిక ఆహారం అందించేందుకు మెనూ మరియు ధరల పట్టికలను వంట ఏజెన్సీలకు అందించాలని తెలిపారు. ఈ చర్యలు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం చేపట్టబడతాయి.
విద్యాశాఖ, బీసీ, ఎస్సీ, మైనారిటీ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలతో కలిసి ఈ మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు జారీ చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు తమ విద్యా కార్యక్రమాలకు తిరిగి వస్తుండగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చురుకైన చర్యలు, సురక్షితమైన మరియు అనుకూలమైన అభ్యసన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడ్డాయి అన్ని అయన అన్నారు.