అతడి వయసు 20 ఏళ్లు.. అంత చిన్న వయసులోనే దారి తప్పాడు.. హ్యాకర్‌గా మారాడు.. ఏకంగా తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్ఐ’ యాప్, ‘టీఎస్‌కాప్’ యాప్, ‘ఎస్ఎంఎస్ సర్వీసెస్’ యాప్‌లను హ్యాక్ చేశాడు. ఎట్టకేలకు అతడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) పోలీసులకు చిక్కాడు. అతడి పేరు జతిన్‌కుమార్, వయసు 20 ఏళ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా వాస్తవ్యుడు, కానీ గ్రేటర్ నోయిడాలో ఉంటూ చదువుకుంటున్నాడు. హ్యాకింగ్ కోర్సులు చేసి, యాప్‌లు, వెబ్సైట్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు. మొదటగా, తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్ఐ’ యాప్‌ను హ్యాక్ చేశాడు. తర్వాత ‘టీఎస్‌కాప్’ యాప్, ‘ఎస్ఎంఎస్ సర్వీసెస్’ యాప్‌లను హ్యాక్ చేసి, డేటాను మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. తెలంగాణ పోలీసులు అతడి లొకేషన్‌ను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. పోలీసుశాఖకు చెందిన యాప్‌లు హ్యాక్ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు ఇబ్బందేమీ లేదని తెలిపారు.

