‘కల్కి 2898ఏడీ’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫుడ్ లవర్ అన్న సంగతి తెలిసిందే. తనతో నటించే వారి కోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం తయారు చేయించి తెప్పిస్తారు. చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ విషయాన్ని చెబుతూ, ప్రభాస్‌తో ఉన్నప్పుడు డైటింగ్ మర్చిపోవాల్సి వస్తుందని సరదా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల, ప్రభాస్ ఒక్క పూట భోజనం కోసం ఎంత ఖర్చు పెడతారన్న విషయంపై కథనాలు బయటకు వచ్చాయి. ప్రభాస్ తన మూడ్ బట్టి ఫుడ్ తినడం ఇష్టపడతారట. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు అంటే ఆయనకు చాలాఇష్టం. ప్రతీ పూట ఎన్నో రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు వండేందుకు చెఫ్‌లు ఉంటారట. ఈ విధంగా చెఫ్‌లను మెయిన్‌టెయిన్ చేయడానికి ప్రభాస్ దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేస్తారట.ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ బయట కథనాలు వైరల్ అవుతున్నాయి.

