Saturday, December 21, 2024
Homenewsవాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ

వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ

 

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

హైదరాబాద్, డిసెంబరు 16 ( వర్డ్ ఇండియా)
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతూ ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై అనే మాటకు కొత్త నిర్వచనం చెప్తూ ప్రతిపక్ష నేత అయిన కేటీఆర్ ని దుయ్యబట్టారు. ఎన్నారై లకు, కుటుంబ పాలనకు రాష్ట్ర ప్రజలు వ్యతిరేక తీర్పునిచ్చారన్నారు.

ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించాలని, ప్రజలు ప్రజా వాణి వినిపిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ పాలనలో ధర్నా చౌక్ ని ఎత్తివేసారని, ఉద్యమ సమయంలో నమోదైన కేసుల గురించి ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీక్ష చేసిందా అని సీఎమ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టభద్దత పై కార్యాచరణ రూపొందిస్తున్నామని, వీటిని పక్కగా అమలు చేస్తామన్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో డీఎస్పీ నలిని రాజీనామా చేస్తే… న్యాయం చేయలేదని, రైతు పంట భీమా లాంటి అవసరమైన పథకాన్ని పట్టించుకోలేదని, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియా పై బీఆర్ఎస్ ఎన్నో అక్రమాలు చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేటీఆర్ బదులిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మొదట కాబినెట్ లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామి ఏమయిందని, బీసీ సబ్ ప్లాన్, బీసీలకు లక్ష కోట్లు, అత్యధికంగా వెనుకబడిన బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్న హామీల గురించి ఆలోచించాలనిA హితవు పలికారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS