తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు తనపై చంద్రబాబు నాయుడు కుట్ర చేసాడని ఆరోపణలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది రోజా. 2019లో నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి చంద్రబాబును తిట్టకుండా రోజా ఒక్క రోజు కూడా నిలకడగా ఉంచలేదు. చంద్రబాబు అరెస్టు అయ్యినప్పుడు రాకెట్లు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకుంది. పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని, పవన్‌ను కూడా నానా మాటలు అనేసింది. తాజా ఎన్నికల్లో రోజా దారుణంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టిన రోజా, ఓడిపోయాక మౌనంగా మారింది. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోందని, లేకపోతే తమిళనాడులో డీఎంకే పార్టీలో చేరే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

