ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో మాట్లాడారు. జగన్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువగానే ఉందని, లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 14 మంది ఉన్నారని చెప్పారు. నాయకుల ధైర్యం సన్నగిల్లకూడదని, పోరాట పటిమ తగ్గకూడదని సూచించారు. తన వయసు చిన్నదైనా, సత్తువ మాత్రం ఎక్కువగా ఉందని, అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి ఉందని అన్నారు.

