రాజకీయాల కోసం చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని.. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ గుర్తు చేశారు. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్విగ్నమైన క్షణం అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో తొలుత అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ అంశం గతంలో పరిహాస్యాస్పదంగా ఉండేది. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఈ సమయంలో ఆయన్ను స్మరించు కోకుండా ఉండలేం.1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది.. చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారు. వాళ్లను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ మహావృక్షం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నం. కానీ ఆ తర్వాత బస్సు యాత్ర మొదలుపెట్ట గానే మళ్లీ అదే గర్జన కనిపించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ యే . గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం.. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం’ అని అన్నారు.
సభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించ వద్దని ఆనాడు స్పీకర్ అన్నారు : బీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్
By WOI
RELATED NEWS