Monday, June 16, 2025
Homenewsసానియా మీర్జా షోయబ్ మాలిక్ విడిపోతున్నారా..!?

సానియా మీర్జా షోయబ్ మాలిక్ విడిపోతున్నారా..!?

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని 2010 ఏప్రిల్ నెలలో పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు 2018 లో ఒక కుమారుడు జన్మించారు. వివాహ అనంతరం సాఫీగా సాగిన వీళ్ళ వైవాహిక జీవితం, ఇటీవ‌లి కాలంలో వీరు వివాహ బంధం నుంచి విడిపోతున్నారంటూ జోరుగా పుకార్లు వస్తున్నాయి. కానీ దానిని ఆ ఇరువురిలో ఎవ‌రూ కూడా అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. పైగా ఆ ఇద్దరూ క‌లిసి పాకిస్తానీ టీవీ చానెల్ రియాలిటీ షో కోసం ప‌ని చేసారు. వీరి విడాకుల రూమ‌ర్ల నేప‌థ్యంలో ఈ రియాలిటీ షో కి ఈ జంట హోస్ట్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది.

గతం లో ఈ సెల‌బ్రిటీ క‌పుల్ విడాకుల పుకార్లు 2022లోను వెలువడ్డాయి. ప్ర‌స్తుతం ఈ జంట దుబాయ్‌లో విడివిడిగా నివసిస్తున్నారని, వారి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌కు సహ-తల్లిదండ్రులుగా ఉంటున్నారని పుకార్లు ఉన్నాయి.

ఇంత‌లోనే సానియా తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివాహం – విడాకుల సవాళ్లను ప్రతిబింబిస్తూ క‌వితాత్మ‌కంగా సాగ‌డంతో మ‌రోసారి పుకార్ల‌కు అవ‌కాశ‌ం ఇచ్చినట్టు అయ్యింది. సానియా ఈ పోస్ట్‌లో పెళ్లి క‌ష్టం.. విడాకులు క‌ష్టం.. నీ దారిలో నువ్వే ఎంచుకో! అని రాసింది. ఆమె జీవిత ఎంపికల కష్టాలను, సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థిక వ్య‌వ‌హారాలు, క‌మ్యూనికేషన్ లోని సవాళ్ల గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో ప్ర‌స్థావించింది.

ఈ సందేశం పూర్తి సారాంశం ఇలా ఉంది. ”వివాహం కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. ఊబకాయం కష్టం. ఫిట్‌గా ఉండటం కష్టం. మీ హార్డ్ ఏమిటో ఎంచుకోండి. అప్పులు చేయడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి” అని రాసింది.

విడాకుల పుకార్లు చాలా కాలంగా ఉన్నా కానీ, సానియా- సోయ‌బ్ చాలా కాలంగా బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. షోయ‌బ్ ని ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే వ్య‌క్తిగ‌త విష‌యాల్లో ఇత‌రుల జొర‌బాటు స‌రికాని వారించాడు. తాను – సానియా విడిపోవడాన్ని ప్రైవేట్ విషయంగా ఉంచాలని ఎంచుకున్నామని, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని చెప్పారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS