Thursday, December 19, 2024
Homenewsహాట్ టాఫిక్ గా మారాన తమిళనాడు ఎంపీ స్థానాలు

హాట్ టాఫిక్ గా మారాన తమిళనాడు ఎంపీ స్థానాలు

సార్వత్రిక ఎన్నికల తొలి దశలో పోలింగ్ జరిగే తమిళనాడులోని కొన్ని స్థానాలు హాట్ టాఫిక్ గా మారాయి. కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బరిలోకి దిగుతుండడంతో ఆయా స్థానాలపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రి మురుగన్ తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడుతుండగా, మాజీ గవర్నర్ తమిళసై ప్రత్యక్ష ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తమిళనాడులో ప్రముఖులు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాలు ఆసక్తి రేపుతున్నాయి. నరేంద్ర మోదీ రెండో దఫా ప్రభుత్వం లో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన ఎల్. మురుగన్ తొలిసారి లోక్ సభ బరిలోకి దిగుతున్నారు. నిల్ గిరిస్ పార్లమెంట్ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజాతో తలపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మురుగన్… ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటివరకు గెలవలేకపోయారు. 2011లో రాసిపురం, 2012 ఉప ఎన్నికలో శంకరన్ కోయిల్, 2021లో ధారాపురం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి గెలుపు చూడాలని పట్టుదలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

వాజ్ పేయి, మన్మోహ్మన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎ.రాజా… డీఎంకే అభ్యర్థిగా మరోసారి నిల్ గిరిస్ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. ఈ స్థానం నుంచి 2009లో రాజా 86 వేల 21 ఓట్లతో ఎండిఎంకే అభ్యర్థి సి.క్రుష్ణన్ పై గెలుపొందారు. 2014లో మాత్రం రాజాకు ఓటమి ఎదురైంది. ఎఐఎడీఎంకే అభ్యర్థి గోపాల క్రుష్ణన్ లక్షాకు పైగా మెజారిటీతో రాజాను ఓడించారు. 2019లో ఇదే స్థానం నుండి రెండోసారి రాజా గెలుపొందారు. ఏకంగా రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో ఎఐఎడిఎంకే అభ్యర్థి తియగరాజ్ పై విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీగా మరోసారి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అంతకుముందు రాజా పెరంబలుర్ లోక్ సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్.. ఆ పదవిని వదులుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులోని చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గతంలో 2009లో చెన్నై నార్త్, 2019లో తుత్తుకూడి లోక్ సభ స్థానాల నుంచి బరిలోకి దిగిన తమిళిసైకి ఓటమే ఎదురైంది. ఈసారి చెన్నై సౌత్ లో డీఎంకే సిట్టింగ్ ఎంపీ తంగపాండ్యన్ పై పోటీపడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేశారు. ఇటీవలి ప్రధాని మోదీ రోడ్ షో కలిసివస్తుందని భావిస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమోళి పోటీ చేస్తున్న తుత్తుకూడి, మరో బంధువు దయానిధి మారన్ పోటీ చేస్తున్న చెన్నై సెంట్రల్ స్థానాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పటికే మూడుసార్లు నెగ్గారు. కాగా కనిమోళి తుత్తుకూడి నుండి సిట్టింగ్ ఎంపీగా మరోసారి బరిలోకి దిగారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS