Tuesday, April 22, 2025

By  అంజద్ మియా

 

సుదీర్ఘంగా దేశాన్ని పాలించిన అనుభవం అతడి సొంతం. స్వాతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న సమరయోధుడు, అపార మేధస్సు, నవభారత నిర్మాత, యోధుడు ప్రపంచదేశాలకు శాంతి విధనాన్ని చూపిన మార్గదర్శి, రాజనీతి దార్శనికుడు,దాదాపు 200 ఏళ్లపాటు బ్రిటీష్ పాలనలో మగ్గిన దేశానికి తన రాజకీయ చతురతతో సరికొత్త వ్యూహలతో దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో నడిపించిన బాటసారి,భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. నేడు ఆయన 134 వ జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నా యావత్ ప్రపంచానికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు.

నెహ్రు1889 నవంబర్ 14 న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఓ సంపన్న కుటుంబంలోని జన్మించారు. ఆయన తండ్రి మోతిలాల్ నెహ్రూ. దేశ స్వాతంత్ర సమరానికై విరివిడిగా దానధర్మాలు చేసిన ఘనత ఆ కుటుంబ సొంతం.ఇక జవహర్ లాల్ నెహ్రూ విషయానికి వస్తే జవహర్ అంటే వజ్రం అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే జవహర్ ది వజ్రాసంకల్పం అంటారు చరిత్రకారులు. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటంలో పోరాడిన తీరు. దనవతుడైన నిరాడంబరంగా జీవించిన నైజం నెహ్రుకే సొంతం పిల్లలన్న గులాబీ పువ్వులన్న నెహ్రూకు అమితమైన ఇష్టం అందుకే అతడిని పిల్లలంతా ప్రేమతో చాచానెహ్రూ అంటూ పిలుస్తుంటారు. అతడి జన్మదినాన్ని యావత్ ప్రపంచం బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.

భారత స్వాతంత్ర్య సమరంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి రౌండ్ టేబుల్ సమావేశంలో భారత వాణిని బలంగా వినిపించడం మరువలేనిది. ప్రజాస్వామ్య విధానానాలకు స్వామ్యవాద సూత్రాలను జోడించి, లౌకికవాదానికి బాటలు వేశారు నెహ్రు. అత్యుత్తమ విదేశాంగ విధానంతో, పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధనే బాటలో నడిపించిన వ్యక్తి నెహ్రు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లలో గాంధీతో కలిసి మార్గనిర్దేశం చేశారు.స్వాతంత్రం అనంతరం భారత ప్రధాని పదవికై సర్దార్ వల్లభాయ్ పటేల్ గట్టిగా పోటీపడగా ఆనాటి నేతలంతా నెహ్రూ యొక్క నాయకత్వానికే మొగ్గుచూపారు.

దాంతో భారత తొలి ప్రధానిగా నెహ్రు భారతదేశ చరిత్రకెక్కారు. భారత ప్రధాని అయ్యాక నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానాన్ని నేటికి అనుసరిస్తున్నారంటే ఆయన ఆలోచన తీరును అర్థం చేసుకోవచ్చు. కాకపోతే పాత విధానాలకె కొత్త రంగులు పూసి అనుసరిస్తున్నారంతే. నాడు అగ్రరాజ్యం అవతరించే క్రమంలో అమెరికా సోవియట్ రష్యాలు సై అంటే సై అంటున్నా తరుణంలో ఆ రెండు దేశాలను కాకుండా మూడో ప్రపంచ వేదికను ఏర్పాటు చేసుకున్న నిఖార్సయిన వ్యక్తి నెహ్రూనే అని చెప్పాలి.

అప్పట్లో ప్రతీదేశం ఆ రెండు అగ్రరాజ్యాలలో ఎదో ఒక దేశానికి మద్దతు తేలుపాల్సిన పరిస్థితి. ఆ సమయంలో సైతం ప్రత్యామ్నాయంగా మూడో ఏర్పాటు చేశారు. అదే అలినోద్యమం. నాడు ప్రపంచ దేశాలన్నీ అణు పరీక్షల్లో మునిగిపోయుంటే నెహ్రూ మాత్రం శాంతిమంత్రాన్ని జపిస్తూ తననూ తాను ఉదారవాదిగా ప్రకటించుకున్నారు.ఐక్యరాజ్య సమితిలోను భారత విధానాన్ని వైక్యారిని స్పష్టంగా చెప్పడంలో ప్రపంచ దేశాల దృష్టిలో ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.యుద్దం కంటే శాంతికే ఎక్కువ పప్రధాన్యమిచ్చినా శాంతి దూత నెహ్రూ.

దేశంలో మిశ్రమా ఆర్దిక విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వ అద్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే, పెట్టుబడుల కోసం ప్రవేటు రంగానికి ప్రోత్సాహకాలు అందించారు. పంచవర్ష ప్రణాళికలతో దేశ రూపు రేఖలనే మార్చడానికి కృషిచేశారు. దేశంలోని వనరులను ఉపయోగించుకుంటూనే మొదటి పంచవర్ష ప్రణాళికలో నీటిపారుదల, విద్యుత్శక్తి, వ్యవసాయం కమ్యూనిటీ, సమాచార రవాణా ,భారీ పరిశ్రమల స్థాపన లాంటి రంగాలకు ప్రోత్సాహకాలు అందించేందుకు కృషిచేశారు. అవి ఆశించిన ఫలితాలనే సాధించాయని చెప్పాలి.

నెహ్రూ ఆర్థిక విధానాలతోనే భారతదేశం ఆర్థికంగా బలోపేతం అయిందని చెప్పవచ్చు. ఆయన హయాంలోనే హెచ్.ఎమ్.టీ, బీ.హెచ్.ఇ.ఎల్, ఐ.డీ.పీ.ఎల్, హెచ్.ఏ.ఎల్ లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. నీటిపారుదల విషయంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నెహ్రు ప్రారంభిచిన పంచవర్ష ప్రణాళికల ఫలితంగానే నేడు భారత దేశం ఆర్థికంగా సామాజికంగా, వైజ్ఞానికంగా అభివృద్ధి పంతంలో సాగుతుందంటే దానికి కారణం నెహ్రూ యొక్క ఈ ప్రణాళికలే. నెహ్రూ అమలు పరిచిన పంచవర్ష ప్రణాళికలలో లోపాలు లేవు కానీ తర్వాత వాటిని అనుసరించిన ప్రభుత్వాలో లోపం ఉందని బలం చెప్పవచ్చు.

అందుకే తదుపరి ప్రభుత్వాలు ప్రాణాళికలకే మరో పేరుతో అమలు పరుస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ ఆధిపత్య రాజ్యాలకు ఎదురొడ్డి నిలవాలని ఆకాంక్షించిన వ్యక్తి నెహ్రూ. చైనా యుద్ధం నేర్పిన గుణపాఠంతో దేశ రక్షణ వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషిచేశారు.దానితో పాటు రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా నెహ్రూ హయాంలోనే ప్రారంభం అయింది.

నెహ్రూ వ్యక్తిగతంగా లౌకికావడి, అందుకే రాజ్య వ్యవస్థకు మతం దూరంగా ఉండాలని భావించారు. భిన్న మతాల సమాహారమైన భారతదేశం లౌకిక దేశంగా ఎదగాలని ఆశించారు. దేశ ప్రజలు మూఢత్వాని వదిలి శాస్త్రీయ దృక్పథం వైపు నడవాలని సూచించారు. లౌకికవాదం తోనే సమసమాజ స్థాపన జరుగుతుందని నమ్మి ఆచరించిన వ్యక్తి నెహ్రూ. అందుకే అతడిని నవభారత నిర్మాతగా పేర్కొన్నారు. నెహ్రూ సహజ సిద్ధంగా రచయిత కూడా. తన రచనలతో ఎందరో మహానుభావులను ప్రభావితం చేసిన అపార మేధావి. ప్రపంచంలో ఉన్న అతికొద్ది మంది బహుప్రజ్ఞాశాలి నాయకుల్లో ఒకరు నెహ్రూ.

అలాంటి నెహ్రూను నేడు కేవలం ఒక పార్టీకి మాత్రమె పరిమితం చేస్తూ గల్లీ లీడర్ గా మాత్రమే భావించే దుస్థితి కల్పిస్తున్నారు కొందరు వ్యక్తులు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా నెహ్రూని కాదని పటేల్ కు చరిత్రలో సముచిత స్థానం కల్పిస్తూ నెహ్రూను చరిత్రపుటల్లోచి తొలిగించే కుట్ర చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీలో నెహ్రూ మ్యూజియం పేరు మార్చడం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఏదైమైనప్పటికి నేటి ఈ ఆధునిక భారత నిర్మాణానికి ఆద్యుడు. పునాది వేసింది మాత్రం నెహ్రూ అనే చెప్పాలి

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS