తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి భాగ్యనగర్ జర్నలిస్టు అసోసియేషన్ ఘన నివాళులు
సికింద్రాబాద్:
తెలంగాణ రాష్ట్ర గీత ‘జయ జయహో తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, గీత రచయిత అందెశ్రీ గారి అకాల మరణం తెలంగాణ మాతృభూమికి తీరని లోటుగా భావిస్తూ భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, దీపప్రజ్వలనతో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ వర్ణిస్తూ, “తెలంగాణ ఆత్మ, తెలంగాణ గౌరవం, తెలంగాణ గొంతును ఒకే గీతంలో నిక్షిప్తం చేసిన స్ఫూర్తిదాయక కవి అందెశ్రీ. ఆయన లేని లోటు తెలంగాణ ప్రజల హృదయాలలో ఎన్నటికీ నిండనిది” అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు సత్యం గౌడ్ మాట్లాడుతూ, *“జగిత్యాల నుండి జయశంకర్ వరకూ … పల్లెలు, ఊర్లు, బస్తీలు, విద్యార్థులు, కార్మికులు – తెలంగాణ ఉద్యమం మొత్తం అందెశ్రీ గారి కలంతో స్వరమైంది. ఆయన గీతం తెలంగాణ ప్రజల ప్రాణశ్వాస. ఆయన పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది”*అని తెలిపారు.
ప్రధాన కార్యదర్శి మున్నూరు చందు మాట్లాడుతూ, “అందెశ్రీ గారి ఆలోచనలు, కలం, కవిత్వం, Telangana ఆత్మను మేల్కొల్పిన శక్తి. ఆయన రాసిన రాష్ట్ర గీతం పంచభూతాల్లా ఎప్పటికీ నిలిచి తెలంగాణ ప్రజల గొంతుల్లో మార్మోగుతుంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ కిరణ్ బేజాడి జాయింట్ సెక్రటరీ నరేష్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ తో పాటు యూనియన్ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
#WordOfIndia #WOI #Andesri #TelanganaGeetam #TelanganaPride #BhagyanagarJournalists #Tribute

