తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి (Vemulawada Rajeswara Swamy) ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. దర్శనానికి సుమారు నాలుగున్నర లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు
భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేములవాడ రాజన్న గుడి (Vemulawada Rajeswara Swamy)లో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. జాతర నిర్వహణ కోసం 3 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాగా దాదాపు 1500 పోలీసులతో మహా శివరాత్రి జాతర బందోబస్తు ఏర్పాట్లు చేసారు. వేములవాడ రాజన్న జాతర కోసం 994 ప్రత్యేక ఆర్టీసి (TSRTC) బస్సులు కేటాయించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ల ఆధ్వర్యంలో జాతర సమన్వయ సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
READ LATEST TELUGU NEWS : అయోధ్య రాముడి విగ్రహం వెనక కన్నీటి గాథ మీకు తెలుసా?