హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (CASE ON MLA)కేసు నమోదైంది. ఈనెల 7న కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ‘బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మళ్లీ తిరిగి అధికారంలోకి మేము వస్తాం. మిత్తితో సహా ఇచ్చేస్తాం.. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ పదిలిపెట్టం.. ఎవరినైనా జైలుకు పంపిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆశిశ్ గౌడ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు (CASE ON MLA) నమోదు చేశారు.
READ LATEST TELUGU NEWS: సీఎం హోదాలో యాదాద్రికి తొలిసారి రేవంత్