Tuesday, April 22, 2025
HomeBRS With BSP: బీఆర్ఎస్‌తో కూటమిపై ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్

BRS With BSP: బీఆర్ఎస్‌తో కూటమిపై ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ ప్రజలకు శుభవార్త అంటూ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘బీఎస్పీ, బీఆర్ఎస్(BRS With BSP)ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్ధానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటమిలో లేనందున.. బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయడానికి బెహన్జీ అనుమతించారని బీఎస్పీ హైకమాండ్ తెలిపింది. త్వరలోనే పొత్తు విషయంలో మాజీ సీఎం చంద్రశేఖర్ రావు సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీఎస్పీ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ బెహన్జీ దూతగా హాజరు కానున్నారు’ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

READ LATEST TELUGU NEWS :  కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరపాలి: ప్రొ. కోదండరాం

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS