వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ(KARIMNAGAR MP)గా తానే గెలుస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాముడి పేరుతో రాజకీయం చేయడం సరికాదని బీజేపీ (KARIMNAGAR MP)ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు వినోద్ కుమార్ హితవు పలికారు. ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాటం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తనను తప్పక ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
READ LATEST TELUGU NEWS: ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తాం: మంత్రి పొంగులేటి