Saturday, December 21, 2024
HomeRaithu Bandhu Latest Update: రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి కీలక కామెంట్స్

Raithu Bandhu Latest Update: రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి కీలక కామెంట్స్

Raithu Bandhu Latest Update: రైతుబంధు (రైతో భరోసా) నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. రైతు బంధు ఇవ్వటంలేదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

ఇప్పటి వరకు 64 లక్షల 75 వేల మంది రైతులకు రూ.5,575 కోట్ల పెట్టుబడి సాయం అందిచామని చెప్పారు. 92 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని లెక్కలతో సహా వివరించారు.

ఇక మిగిలింది 5 లక్షల మంది రైతులు మాత్రమేనని భట్టి అన్నారు. ఐదు ఎకరాల్లోపు రైతుబంధు(Raithu Bandhu) నిధులు పూర్తిగా చెల్లించినట్లు వెల్లడించారు.

Read Also: నేను పార్టీ మారితే మీకు భయమెందుకు: కడియం శ్రీహరి

గత ప్రభుత్వం కంటే తామే రైతుబంధు(Raithu Bandhu Latest Update) డబ్బులను రైతులకు చాలా వేగంగా వేస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేయలేదని భట్టి వ్యాఖ్యానించారు.

గత బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టులో ఉన్న నీళ్లను జాగ్రత్తగా వాడుకుంటే ఇప్పుడు నీటి ఎద్దడి వచ్చేది కాదని ఆయన అన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు.

READ LATEST TELUGU NEWS: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకా ఆగ్రహం

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS