Kadiyam Srihari Counter On BRS: తాను పార్టీ మారితే బీఆర్ఎస్‌కు భయమెందుకని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.
ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై.. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను కడియం శ్రీహరి(Kadiyam Srihari in Congress) సేకరించారు.
Read Also: కేసీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. తన కుమార్తె కడియం కావ్యకు(Kadiyam Kavya) ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కడియం శ్రీహరి తెలిపారు.
కేసీఆర్ ఉద్యమకారులకు ఏమీ చేయలేదని, ఒక్క రోజు కూడా దగ్గరికి రానివ్వలేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ నేతలే తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలను అందరిని కలుపుకొని పార్టీలోకి రావాలని ఆహ్వానించారని కడియం శ్రీహరి(Kadiyam Srihari Counter On BRS) అన్నారు.
READ LATEST TELUGU NEWS: కాంగ్రెస్ గూటికి మేయర్ గద్వాల విజయలక్ష్మి?