Planning For KCR Arrest: ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. భారాస పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు, బడా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసినట్లు కేసీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో భాగంగా పోలీస్ అధికారులు అయిన ప్రణీత్ రెడ్డి, భుజంగరావు, తిరుపతయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారంతా కూడా కేసీఆర్(EX CM KCR WILL ARREST) చెప్పారు కాబట్టే చేసామని అంటున్నారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఫోన్ ట్యాప్ చేసిన డేటాను హార్డ్ డిస్క్‌లలో పెట్టి వాటిని ధ్వంసం చేసారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశంపై కూడా కీలకంగా విచారణ జరగనుంది.
కేసీఆర్‌తోపాటు భారత రాష్ట్ర సమితికి చెందిన మరో నలుగురు నేతలు చెప్పడం వల్లే చేసామని నిందితులంతా చెప్తున్నారు.
ఇలా ఎటు వైపు నుంచి చూసినా కేసీఆర్‌కు ఉచ్చు బిగుస్తోందనే చెప్పాలి. దీంతో కేసీఆర్ అరెస్ట్‌కు రంగం(Planning For KCR Arrest) సిద్ధం అవుతున్నట్లే అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
READ LATEST TELUGU NEWS: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక.. భేటీకి హాజరుకాని కేటీఆర్