తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping) కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు దర్యాప్తు బృందం ఆయనను విచారణ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping) విచారణలో భాగంగా సీఐ గట్టుమల్లు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లే తాను వ్యవహరించానని గట్టుమల్లు వాంగ్మూలం ఇచ్చారట.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా అదే విభాగంలో ఓఎస్డీగా పనిచేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఆయనను రాత్రి వరకు విచారణ చేసింది. ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
రాధాకిషన్ రావును ప్రశ్నించే సమయంలో పోలీస్ స్టేషన్ గేట్లు మూసి గోప్యత పాటించారు. సస్పెండైన డీసీపీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) ద్వారా సమాచారం అందించారు. ఆ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా రాధాకిషన్ రావు టీమ్ క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఈ కేసులో లేవనెత్తాయి.
కాగా ఈ కేసులో ఇప్పటికే అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగారావులను ఏప్రిల్ 2 వరకు ఐదురోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆయనను అరెస్ట్ చేసి 14 రోజులు గడిచిన కారణంగా కస్టడీకి ఇవ్వకూడదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఇక విచారణలో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) లో వచ్చిన సమాచారం ఆధారంగా ఏయే ఆపరేషన్లు చేశారు? హవాలా లావాదేవీలపై చేసిన దాడుల్లో ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేశారా?. అనే అంశాలపై ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుండగానే బేగంబజార్‌లోని కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ప్రాంతంలో రాధా కిషన్ రావు బృందం సోదాలు చేసేవారు. దీంతో వ్యాపారులతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు.. ప్రణీత్ రావు డ్రైవర్, ఓ కానిస్టేబుల్‌లను సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడంలో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన సిరిసిల్ల మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వార్ రూంలోని సుమారు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆయన ఈ పనిచేశారు. దీంతో ఆయనపై మార్చి 10న పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనను మార్చి 12న పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)ను ఎన్నికల వేళ బీఆర్ఎస్ సర్కార్ ఓ ఆయుధంగా వాడుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని సమాచారం.
స్థానిక నేతల ఫోన్లే కాకుండా.. ఢిల్లీలోని కొందరు కేంద్ర మంత్రులు, వారి ఆఫీస్ సిబ్బంది, స్నేహితులతో పాటు బీజేపీలోని ముఖ్యమైన నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందట.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో పనిచేసిన ఈ అధికారులంతా ప్రముఖులపై నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబంధిత డేటా ఉన్న హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
READ LATEST TELUGU NEWS: ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిందే!