ఇసుకలారీ డ్రైవర్‌పై ఇద్దరు కానిస్టేబుళ్లు దౌర్జన్యం చేశారు. మహబూబాబాద్ కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో వస్త్రాలు చిరిగేలా దాడి(Attack On Lorry Driver) చేశారు. కానిస్టేబుళ్ల దాడి సమయంలో లోదుస్తులతో మాత్రమే ఉన్న డ్రైవర్ ఫొటో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గోదావరి నుంచి ఇసుకలారీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి వస్తాయి. నిబంధనల ప్రకారం12 టైర్లు కలిగి ఉన్న లారీలో 27 టన్నులు, 14 టైర్లు కలిగి ఉన్న లారీలో 29 టన్నులు, 16 టైర్లు కలిగి ఉన్న లారీలో 40 టన్నుల ఇసుక తీసుకురావాల్సి ఉంటుంది.
అయితే లారీ డ్రైవర్లు కొంతమంది లారీల్లో అధికంగా ఇసుకను తీసుకువస్తుంటారు. ఈ నెపంతో కొందరు కానిస్టేబుళ్లు ఇసుక లారీలను నిలిపి పరిమితికి మించి ఇసుక తీసుకువస్తున్నారనే కారణంలో జరిమానా వసూళ్లు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.
అయితే మహబూబాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న ఓ కానిస్టేబుల్, వారం రోజుల క్రితం సదరు లారీ డ్రైవర్‌ను ఇసుక అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరుగగా లారీ డ్రైవర్‌పై ఇద్దరు కానిస్టేబుళ్లు దాడికి(Attack On Lorry Driver) పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇసుక ఇవ్వలేదనే నెపంతోనే నడిసెంటర్‌లో డ్రైవర్‌పై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫొటో వైరల్ కావడంతో పెట్రోలింగ్ సమయంలో డ్రైవర్ లారీని ఆపనందుకే కానిస్టేబుళ్లు వెంబడించి పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎస్సై వంశీధర్‌ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని.. విచారణ చేసి పైఅధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు.
READ LATEST TELUGU NEWS: కాంగ్రెస్ గూటికి మేయర్ గద్వాల విజయలక్ష్మి?