ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha Case Update) బంధువులు, బినామీల ఇళ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సోదాలు చేపట్టింది.
మాదాపూర్ డీఎస్ఆర్ అపార్ట్ మెంట్స్‌లోని కవిత భర్త అనిల్ చెల్లెలు అఖిల ఫ్లాట్, భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. మాదాపూర్‌లో ఏడుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం సోదాలు చేస్తోంది. కవిత కస్టడీ నేటి(Kavitha Case Update)తో ముగియనున్న నేప థ్యంలో ఈడీ సోదాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
కాగా.. ఆరు రోజుల కస్టడీ విచారణలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి కీలక సమాచారం రాబట్టారు. గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ సుంచే రూ.100కోట్లు తరలించినట్లు ఇప్పటికే ఈడీ ఆధారాలు సేకరించింది.
హవాలా రూపంలో డబ్బులు చేతులు మారిన తేదీలు, ఈ కేసులో ఇప్ప టికే అరెస్ట్ అయిన సౌత్ గ్రూప్ నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు పెంచింది. ముడుపులుగా వెళ్లిన డబ్బుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ వెంటవెంటనే సోదాలు చేస్తోంది. అఖిల కుటుంబ సభ్యుల పేరుతో పలు షెల్ కంపెనీలు ఆపరేట్ చేసినట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఆయా కంపెనీల నుంచే హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం.
READ LATEST TELUGU NEWS: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు