Saturday, November 15, 2025
HomeKadiyam Srihari: కడియం ఇంటికి హస్తం నేతలు

Kadiyam Srihari: కడియం ఇంటికి హస్తం నేతలు

మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి(Kadiyam Srihari) నివాసానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ వెళ్లారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని కడియం నివాసానికి వెళ్లిన దీపాదాస్ మున్షీ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కడియం ఫ్యామిలీని ఆహ్వానించారు.

గురువారం కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూతురు, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షీ కడియం నివాసానికి వెళ్లి శ్రీహరి, కావ్యతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.

కడియం శ్రీహరితోపాటు కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కడియం ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ భేటీలో మల్లు రవి, సంపత్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఖైరతాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

READ LATEST TELUGU NEWS:  బ్యాంకు అధికారులు రజాకార్లను తలపిస్తున్నారు: హరీశ్ రావు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS