Kishan Reddy Basti Bata In HYD:దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దుతామని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుందని పునరుద్హాటించారు.
Read Also: టీడీపీపై బీజేపీకి పెద్ద ఆశలేం లేవు: విజయసాయి
తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ఈనెల 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు.
2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం మాట తప్పారని కిషన్ రెడ్డి(Kishan Reddy Basti Bata In HYD) విమర్శించారు.
గ్రామస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి సూచించారు. ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో నరేంద్ర మోడీనే ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.