Wednesday, April 23, 2025
HomePrakash Raj: బీజేపీపై నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్

Prakash Raj: బీజేపీపై నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్

కేంద్రంలోని అధికార బీజేపీపై నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘420’లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తాం అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆయన ప్రకాశ్ రాజ్(Prakash Raj) అభిప్రాయపడ్డారు. అది కాంగ్రెస్ అయినా, ఇతర ఏ పార్టీ అయినా ఇలా మాట్లాడడం అహంకారమేనని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు కర్ణాటకలోని చిక్కమంగళూరులో ప్రకాశ్ రాజ్(Prakash Raj) మీడియాతో మాట్లాడారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా సీట్లు గెలుస్తుందని, ముందుకెళ్లి 400 సీట్లు మావేనని ఏ పార్టీ చెప్పకూడదని అన్నారు.

ఇలా చెప్పడం వారి అహంకారానికి అద్దం పడుతోందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. 400 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఫిబ్రవరి 5న రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చ సందర్భంగా లోక్‌సభలోనూ మోడీ ఈ మాట అన్నారు. ఎన్డీఏ మూడవ దశ ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా ఎంతో దూరం లేదని, ఈసారి 400 సీట్లు గెలుస్తామన్న విషయం తెలిసిందే.

READ LATEST TELUGU NEWS: ఒకే స్టేజీపై సీఎం రేవంత్‌తో ప్రధాని మోడీ ముచ్చట

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS