EX CM KCR District Tour:కాంగ్రెస్ పార్టీ కరువు రాజకీయాలు చేస్తుందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచాయి.
కేసీఆర్ పంటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సైతం అదేరీతిలో తిప్పికొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
రైతన్న మీ కోసం నేనున్నా ✊ pic.twitter.com/fZxxvUG4hT
— BRS Party (@BRSparty) March 31, 2024
కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారు: భట్టి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవీల జిల్లాల పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు కాకరేపాయి.
దీంతో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే తట్టుకోలేకే కేసీఆర్ రైతుల అంశాన్ని తెరపైకి తెచ్చారని డిప్యూటీ సీఎం భట్టి(Bhatti vikramarka) విక్రమార్క విమర్శించారు.
కేసీఆర్ మాటల్లో వాస్తవాలు లేవని మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా అని ప్రశ్నించారు. మైక్ సమస్య వస్తే..కరెంట్ కోతలు అంటూ అబద్ధాలు మాట్లాడారని చెప్పారు.
కేసీఆర్ పంటబీమా ఇవ్వలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఉండదని జోస్యం చెప్పారు.
తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. అందుకే పొలంబాట(EX CM KCR District Tour) పట్టారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పంటబీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోయారని తెలిపారు.
Read Also: నాపై ఎందుకంత కక్ష: పవన్ కల్యాణ్
అది మొసలి కన్నీరు : శ్రీధర్ బాబు
రైతులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ సీట్ల కోసం అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ గత పది సంవత్సరాలలో రైతులను పట్టించుకోలేదని .. గతేడాది వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ప్రకృతి వైపరీత్యాలకు.. ప్రభుత్వాన్ని నిందిస్తారా? : తుమ్మల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని కేసీఆర్‌ను నిలదీశారు.
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపడమేంటని తప్పుబట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా ఇప్పుడు తప్పొప్పులను లెక్కగడుతోందని విమర్శించారు.
కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
రైతు పంట తగలబెట్టుకుంటున్నాడు: నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లు మాటలతో ఎక్కువ రోజులు దృష్టి మరల్చలేరని మండిపడ్డారు.
సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆగ్రహంవ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నిర్వాకంతో కష్టపడి సాగుచేసిన రైతు… తన పొలాన్ని తగులబెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు.. ఏమేం ఉన్నాయో తెలుసా?
చేతగాని ప్రభుత్వం:కేటీఆర్
రైతుల దుస్థితిని చూసి చలించిపోయే కేసీఆర్.. సాగునీటి కటకట లేకుండా చేశారని మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని మండిపడ్డారు.
చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నమ్మించి.. మోసం చేసింది: హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
రైతు బంధు, రుణమాఫీ అమలు చేయకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం అర్థమౌతోందని చెప్పారు.
లీక్ వార్తలు, ఫేక్ వార్తలతో బీఆర్ఎస్‌పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ జిల్లాల పర్యటన(EX CM KCR District Tour)కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
READ LATEST TELUGU NEWS: రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి కీలక కామెంట్స్