పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అకీరా తన తండ్రి వెంట ఉంటూ పాపులారిటీ సంపాదించాడు. రేణు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పంచుకున్నారు. అయితే, ఫ్యాన్స్ నుంచి వచ్చే నెగెటివ్ కామెంట్లకు విసిగి పోయిన రేణు, “నా మాజీ భర్తను తిరిగి పొందాలని లేదా కోల్పోతున్నానని భావించి, అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేసిపడేస్తాను” అని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా, కొందరు రేణు దేశాయ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు అకీరా, ఆద్యలను బాగా పెంచారని ప్రశంసిస్తున్నారు.

