BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ఫీవర్ పట్టుకుందునే చెప్పాలి. తాజాగా హీరో ప్రభాస్ అభిమానులు ముంబైలోని ఒక థియేటర్ వద్ద 120 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడమే దీనికి ఉదాహరణ. కాగా ఈ వీడియోని సలార్ టీం పోస్ట్ చేసింది.
అయితే సలార్ సినిమా ఈనెల 22న విడుదల కానున్న నేపథ్యంలో ఇంతటి పెద్ద ఫ్లెక్సీ ని ముంబై ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం పట్ల అభిమానులకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో ఇంతటి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై అభిమానుల అంచనాలకు అవధుల్లేకుండా ఎప్పుడెప్పుడు సినిమాని వీక్షిద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.