Congress 9 Guarantees in AP: ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని వైయస్. షర్మిల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.
9 గ్యారెంటీలు ఇవీ.
1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు
2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500
3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత
6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు
9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను… ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను
రాష్ట్రానికి బీజేపీ ఎలాంటి మేలు చేయకపోయినా… వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని విమర్శించారు.
Read Also: కాపు ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు?
ఏపీలో ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా తయారయ్యాయని వైయస్. షర్మిల (YS Sharmila) అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరేనని… ఒకరిది బీజేపీతో బహిరంగ పొత్తు అయితే, మరొకరిది రహస్య పొత్తు అని ధ్వజమెత్తారు.
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పేద ప్రజల సంక్షేమం కోసం.. రాష్ట్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు.
కాంగ్రెస్ గ్యారంటీలు
-రూ.1లక్ష సంవత్సరానికి మహిళా మహాలక్ష్మి
ప్రతి పేద మహిళకు ప్రతి నెలా రూ.8333
-రైతు రుణమాఫీ రూ.2లక్షల వరకు… pic.twitter.com/Wg2VQ0xIyy— YS Sharmila (@realyssharmila) March 30, 2024
2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆపై విడిపోయిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇక, నిర్మలా సీతారామన్ అయితే జగన్‌ను మోదీ దత్తపుత్రుడిగా అభివర్ణించారని షర్మిల వెల్లడించారు. ఇక ఈ తొమ్మిది గ్యారంటీల(Congress 9 Guarantees in AP)తో ప్రజాసంక్షేమం దిశగా ఏపీ దూసుకుపోతుందని ఆకాంక్షించారు.
READ LATEST TELUGU NEWS: వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ