Astrology : ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు (Rashi Phalam) ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక-1వ పాదం )
మేష రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పనుల్లో శుభం. మీరు తీసుకునే నిర్ణయాలు విజయానికి చేరువ చేస్తాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. పేరు ప్రతిష్ఠలు మీ ఇంటి తలుపుతడతాయి. మీరు ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న పనికి ఫలితం దక్కుతుంది. పదవులు వస్తాయి. వ్యాపారంలో లాభం. ఇష్ట దైవాన్ని స్మరించండి.. మీ కోరికలు తీరుతాయి.
వృషభం( కృత్తిక – 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర – 1, 2 పాదాలు)
ఐశ్వర్యం తలుపుతడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సరైన ప్రయత్నాలు చేయాలి. మీ లక్ష్యం నెరవేరుతుంది. గందరగోళ విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆగిన పనులు తిరిగి మొదలెడుతారు. ఉద్యోగంలో అన్నీ బాగుంటాయి. కొందరికి మీ వల్ల లాభం చేకూరుతుంది. వ్యాపారంలో కష్టాలు రావొచ్చు. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.
మిథునం ( మృగశిర- 3, 4 పాదాలు, అర్ద్ర, పునర్వసు- 1, 2, 3 పాదాలు)
మనోబలంతో పనులు ప్రారంభిస్తే.. అంతటా మంచే స్వాగతం పలుకుతుంది. పట్టుదలతో పనిచేయండి. అపోహలు తొలగిపోతాయి. దూరమైన ఆత్మీయులు మళ్లీ కలుస్తారు. పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి. ఆగిపోయిన విషయాలు ప్రారంభమైతాయి. మీ పనితీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్య నారాయణ మూర్తిని కొలిస్తే శుభం.
కర్కాటకం ( పునర్వసు – 4వ పాదం, పష్యమి, ఆశ్లేష)
పనుల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. తొందరపడకండి. వివాదాల జోలికి పోకండి. పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ధర్మబద్ధంగా ధైర్యంగా ముందుకు వెళ్లండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలపై ఓ కన్ను వేయాలి. గ్రహబలం సరిగా లేదు. ప్రయత్నం గట్టిగా చేయండి. కానీ ఓ విజయం సిద్ధిస్తుంది. ఇష్ట దైవాన్ని వేడుకుంటే మంచిది.
సింహం ( మఖ, పుబ్బ, ఉత్తర – 1వ పాదం)
మనోధైర్యంతో నిర్ణయాలను తీసుకోండి. కష్టాలను అధిగమించి విజయ తీరాలు తాకుతారు. పరిస్థితులకు లోబడి పనిచేయండి. అసహనంతో కాలాన్ని వృథా చేయకండి. మీ పక్కనే ఉండి ఇబ్బందులకు గురిచేసే మనుషులున్నారు. మీ ఊహకందని సంఘటనలు జరుగుతాయి. మీ ప్రతిభే మిమ్మల్ని కాపాడే అవకాశముంది. శ్రీ మహాలక్ష్మిని పూజించండి.
కన్య ( ఉత్తర – 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త- 1,2 పాదాలు)
మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల అండదండలతో మంచి ఫలితాలు చూస్తారు. వివిధ మార్గాల్లో విజయం వరిస్తుంది. మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. మెల్లగా పరిస్థితులు చక్కబడతాయి. సంపద కనపడుతుంది. ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం చేయండి.
తుల ( చిత్త- 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ- 1, 2, 3 పాదాలు)
సంపద పెంచుకోవడానికి పలు మార్గాల్లో ప్రయత్నించేందుకు అనువైన కాలం. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ అవసరం. సాధారణ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితం. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి అయ్యేలా ప్రణాళికలు వేసుకోండి. నిరుత్సాహం నష్టాన్ని మిగిలిస్తుంది. ధర్మదేవత కటాక్షం ఉంది. వ్యాపారంలో బాగా కష్టపడాలి. మనశ్శాంతి కోసం ఇష్ట దేవతను స్మరించాలి.
వృశ్చికం ( విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
మంచికాలం నడుస్తోంది. ఈ వారం తీసుకునే నిర్ణయాలను విజయం వరిస్తుంది. మీ ప్రయత్నాల్లో స్పష్టత గోచరిస్తుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. క్రమక్రమంగా అభివృద్ధిని చూస్తారు. వ్యాపారం లాభదాయకం. నూతన ప్రయత్నాలు ఫలితాలను తీసుకొస్తాయి. పెట్టుబడుల్లో రాణిస్తారు. గతంలో పెండింగ్ ఉన్న పనులు త్వరలో పూర్తవుతాయి. సూర్యానారాయణ మూర్తి దర్శనం శుభవార్త సూచకం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ- 1వ పాదం)
శుభప్రదమైన కాలం. మీ పనులు త్వరగా పూర్తైపోతాయి. ఉద్యోగంలో ప్రశంసలు వింటారు. నూతన ప్రయత్నాల్లో విజయం. ఆర్థికంగా మంచి స్థాయి లభిస్తుంది. క్రమంగా ఉన్నత స్థితిలో కూర్చుంటారు. భూమి, గృహం, వాహనా యోగాల్లో అనుకూల పరిస్థితులున్నాయి. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో విజయాలను ఇస్తాయి. లక్ష్మీదేవిని దర్శించుకుంటే అంతా మేలు జరుగుతుంది.
మకరం ( ఉత్తరాషాఢ- 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట- 1, 2 పాదాలు)
పనుల్లో అభివృద్ధి ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. సంపద కలిసివస్తుంది. వ్యాపారం బాగుంటుంది. తోటివారి సాయం అందుతుంది. ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందడానికి సరైన సమయం ఇది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. సమయస్ఫూర్తితో కష్టాలను దాటాలి. అందరితో ప్రశాంతగా మాట్లాడాలి. పరమశివుని పూజ మంచిది.
కుంభం ( ధనిష్ట- 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర- 1, 2, 3, పాదాలు)
ఏదైనా పని ప్రారంభించాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్నేహితుల సహాయం అవసరం. ధ్యైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగేయండి. ఉద్యోగవ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనుల్లో విజయం. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదివితే అంతా శుభం.
మీనం ( పూర్వాభాద్ర- 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ధర్మదేవత అనుగ్రహం ఉంది. ఏకాగ్రతతో పనిచేయాలి. మీ పనులకు ఈర్ష్యపరులు అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఉద్యోగంలో మంటి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహాయసహకారాలు ఉంటాయి. నూతన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు దూకండి. ఖర్చులు పెరిగే అవకాశముంది. ఇష్టదైవన్ని పూజించండి శుభవార్త వినిపిస్తుంది.
READ LATEST TELUGU NEWS : వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసా?