మహ్మద్ సిరాజ్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎక్కడో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. రికార్డులు తిరగేస్తున్నాడు. నేడు సిరాజ్ 30వ పుట్టినరోజు(Happy Birthday Siraj). ఈ సందర్భంగా బీసీసీఐ ఓ ఎమోషనల్ వీడియో రూపొందించింది.
ఆ వీడియోలో మహ్మద్ సిరాజ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. హైదరాబాద్‌లో తనకిష్టమైన ప్రదేశాల్లో తిరుగుతూ.. తన స్నేహితులతో కలిసి ఛాయ్ తాగాడు. ఒకప్పుడు తిరిగిన రోడ్లపై విలాసవంతమైన కారు నడుపుతూ తన కష్టాలను గుర్తు చేసుకున్నాడు.
ఈ వీడియోలో సిరాజ్ ఏం చెప్పాడంటే..” మీకు మంచి ఛాయ్ తాగాలని ఉందా? రండి తీసుకెళ్తా. నా జీవితంలో నాకెప్పుడైనా బాధ అనిపిస్తే నేను వచ్చే మొదటి ప్లేస్ అది. నాకు అక్కడ చాలా ప్రశాతంగా ఉంటుంది” అంటూ కారు మెల్లగా నడుపుతూ అలా తన బీసీసీఐ టీమ్‌తో కారులో చక్కర్లు కొట్టాడు.
ఇంకా సిరాజ్ ఏమన్నాడంటే.. ” నేను నా చిన్నప్పటినుంచీ అంతలా కష్టపడకుండా ఉంటే.. నా సక్సెస్‌కు ఇంతా విలువ వచ్చి ఉండేది కాదు. కానీ కొందరికీ ఈ విషయం తెలియక పోవచ్చు. మా ఏరియాలో ప్రతీ పిల్లోడు నేను సిరాజ్‌ని అవుతాను అంటున్నారు’ అంటూ తనకు ఇష్టమైన టీ స్పాట్‌కి సిరాజ్ కారు తీసుకెళ్లాడు.
‘ ఇదిగో నేను ఎప్పుడూ టీ తాగే ప్రదేశం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇక్కడే స్నేహితులతో ముచ్చట్లు పెడుతూ అల్లరి చేస్తుంటా. వారితో క్రికెట్ ఆడుతుంటా. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా పదండి’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్‌లో కారు నడుపుతూ తన గతాన్ని పంచుకున్నాడు.. సిరాజ్ భాయ్.
నా చిన్నప్పుడు ఇక్కడన్ని కొండలు చెట్లతో నిండిపోయి ఉండేది. అసలు ఇక్కడ ఏం ఉండేవి కాదు. నేను హైదరాబాద్‌లో కాలు పెట్టగానే.. ఇంటికెళ్లిన వెంటనే నేను చూడాలనుకునే ప్రదేశం ఈద్గా. నేను ప్రపంచంలో ఎక్కడికెళ్లినా.. ఇంతకంటే ఎక్కువ దేన్ని ఇష్టపడను. నిజంగా చెబుతున్నా ఇక్కడ నాకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. నా బాల్యమంతా ఇక్కడే గడిచింది. నేను ఇక్కడే పెరిగాను. ఇంకా నా దోస్తులంతా ఇక్కడే కలుస్తారు. మేం ముచ్చట్లు పెడతాం. నవ్వుకుంటాం అల్లరి చేస్తాం. ఛాయ్ తాగుతాం. కాసేపు క్రికెట్ ఆడుతాం’ అంటూ నీలోఫర్ కేఫ్ దగ్గర కారు ఆపి.. హైదరాబాదీ స్టైల్లో 2/4 ఛాయ్ 4 బన్ మస్కా అంటూ సిరాజ్ ఆర్డర్ చేశాడు.
🏠 𝙃𝙤𝙢𝙚𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙛𝙩. 𝙈𝙤𝙝𝙖𝙢𝙢𝙚𝙙 𝙎𝙞𝙧𝙖𝙟
As he celebrates his birthday, we head back to Hyderabad where it all began 👏
The pacer's heartwarming success story is filled with struggles, nostalgia and good people 🤗
You've watched him bowl, now… pic.twitter.com/RfElTPrwmJ
— BCCI (@BCCI) March 13, 2024
అలా ఓ కప్పు నీలోఫర్ ఛాయ్ తాగి.. మళ్లీ కారు బయటికి తీశాడు. ఇక రండి నేను పెరిగిన.. క్రికెట్ ఆడిన ప్రదేశాన్ని చూపిస్తా అంటూ కారును డ్రైవ్ చేయడం మొదలెట్టాడు. ‘ నాకు కారులో ఉన్నప్పుడు.. హృదయం బరువెక్కించే సాంగ్స్ వినడం ఇష్టం’ అంటూ ఓ పాట పాడుతూ రోడ్లపై వీధి దీపాలను చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు.
ఇంకా తనకు 18 ఏళ్లున్నప్పుడు క్యాటరింగ్‌కి వెళ్లే వాడినని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు చదువుకో బేటా చదువుకో అనేవారని నవ్వుతూ చెప్పాడు. ఆ సమయంలో తనకు క్రికెట్ ఆడటమంటే ఇష్టమని సమాధానమిచ్చేవాడట.
ఈ సందర్భంగా తన చిన్నప్పటీ ఇంటి పరిస్థితులను సిరాజ్ గుర్తుచేసుకున్నాడు. ‘ మేము ఆరోజుల్లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నాన్న ఒక్కరే సంపాదించే వారు. అందుకే నేను కూడా ఏదో ఓ పని చేసేవాడిని. నాకు పెద్దగా పనులు రాకపోతుండే. రూ. 200 కోసం రుమాలీ రోటీలు చేసేవాడిని. అందులో రూ.150 ఇంట్లో ఇచ్చేవాడిని. రూ.50 నాతో పెట్టుకునే వాడిని. రోటీలు చేసేటప్పుడు నా చేతులు కాలేవి. ఇవన్నీ చాలా సున్నిత అంశాలు’ అంటూ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అప్పుట్లో తన తండ్రి ఆటో నడిపేవారని.. ఇంట్లో ఓ ప్లాటినా బైక్ ఉండేదని అన్నాడు. ఆ బైక్ కూడా వెంటనే స్టార్ట్ అయ్యేది కాదని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. కానీ అదంతా తన మంచికేనని.. అన్ని కష్టాలు పడ్డాను కనుకే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు.

అనంతరం తను చిన్నప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసిన ఈద్గా గ్రౌండ్‌కి కారును తీసుకెళ్లాడు. కాసేపు క్రికెట్ ఆడాడు. తన స్నేహితులన కలిసి ఛాయ్ తాగాడు. ప్రపంచంలో ఈ ప్రదేశమే తనకు ఎక్కువ మనశ్శాంతినిస్తుందని ఈ సందర్భంగా సిరాజ్ తెలిపాడు. ఆ ప్రదేశాన్ని చూస్తూ తన మెమోరీస్ పంచుకున్నాడు. అక్కడ గ్రౌండ్‌లో బౌలింగ్ వేసేవాడినని సంతోషం వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత సిరాజ్ స్నేహితులు ఆయన గురించి చెబుతూ.. అప్పటికీ ఇప్పటికీ సిరాజ్ తమతో ఉండే విధానం కొంచెం కూడా మారలేదని చెప్పారు. సిరాజ్ సిక్స్‌లు కొడితే బిల్డింగ్ అవతల పడేవని నవ్వుతూ చెప్పుకొచ్చారు. తమ స్నేహితుడు దేశానికి ఆడటం చాలా గర్వంగా ఉందని ఆనందపడ్డారు. మొత్తానికి పుట్టినరోజు సందర్భంగా తన జీవితాన్ని ఇలా పంచుకున్నాడు. ఇక ఇలాంటి ఎందరికో స్ఫూర్తినిచ్చే లోకల్ భాయ్ మహ్మద్ సిరాజ్‌కు మనమందరం కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు(Happy Birthday Siraj) చెబుదాం.
READ LATEST TELUGU NEWS : కొత్త బ్యాట్ పట్టిన ధోని.. మిత్రుడి కోసం ఏం చేశాడంటే!