BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా):
ప్రభుత్వ చీఫ్ విప్ గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తో పాటు నలుగురి శాసనసభ్యులను నిర్ణయిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తనను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎంపికైనవారిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జటోత్ రాంచందర్ నాయక్ లు ఉన్నారు.