MLA Vivekananda Fires On CM: రేవంత్ భాష చీప్ గా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. దాని గురించి భట్టి మాట్లాడకుండా.. కేటీఆర్ భాష గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ భవన్‌లో కేపీ వివేకానంద విలేకర్లతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ట్యూషన్ పెట్టి భాష గురించి నేర్పించాలని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
ఏప్రిల్ 6న జరిగే సభలో ఆరు గ్యారంటీలపై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులను చూపించి హామీలు ఎగ్గొడుతున్నారని వివేకానంద(BRS MLA Vivekananda) మండిపడ్డారు.
Read Also: కరీంనగర్ ఎంపీగా నేనే గెలుస్తా: బోయినపల్లి వినోద్ కుమార్
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వారికిచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే వివేకానంద ఫైర్(MLA Vivekananda Fires On CM) అయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌లో తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఓపెన్‌గా చెప్పారన్నారు.
తాము కూడా అదే విషయాన్ని చెబుతున్నామని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తిరుగుతున్నారని విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపించారు.
READ LATEST TELUGU NEWS: ఎన్నికలకు ఈ ఐదు అంశాలు.. అడ్డుపడతాయా? ఆదుకుంటాయా?