Friday, April 18, 2025
HomenewsKTR Warning: యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ మాస్ వార్నింగ్

KTR Warning: యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR Warning) కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. గుడ్డిగా వ్యతిరేకించడం వలనో, లేక.. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్(KTR Warning) ఆరోపించారు.

ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఈ దుర్మార్గమైన, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం కేసులతో పాటు . క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

దీంతో పాటు.. ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

READ LATEST TELUGU NEWS: 2028లో సీఎం నేనే.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS