Friday, January 16, 2026
HomeTraining For Election Staff: ఎన్నికల సిబ్బందికి శిక్షణా

Training For Election Staff: ఎన్నికల సిబ్బందికి శిక్షణా

Training For Election Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పర్యేవక్షణలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు.

ఎన్నికల అధికారులకు పోలింగ్‌ విధులు, ఈవీఎం యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగించారు.

పోలింగ్‌ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించే విధానం గురించి ట్రైనింగ్ ఇచ్చారు.

Read Also: ఎలక్షన్ కోడ్ సమయంలో సీఎం పవర్ ఎంత?

బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్‌ కేంద్రాల్లో అమర్చడం.. పోలింగ్‌ స్టేషన్‌ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం-7లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలింగ్‌ స్టేషన్‌ ఎదుట ప్రదర్శించే విధి విధివిధానాలపై శిక్షణ (Training For Election Staff)నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి నిబంధనల పరిధలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

READ LATEST TELUGU NEWS:  ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా         

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS