Monday, June 16, 2025
HomenewsMystery Diseases: అంతుచిక్కని జబ్బుతో అల్లాడుతున్న కుక్కలు!!

Mystery Diseases: అంతుచిక్కని జబ్బుతో అల్లాడుతున్న కుక్కలు!!

పట్టణాలే కాదు మారుమూల పల్లెటూర్లలో కూడా వీధి కుక్కలు సెవెన్త్ సెన్స్ సినిమా చూపిస్తున్నాయి. విచిత్రమైన జబ్బు (Mystery Diseases)తో శునకాలు వీధుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ సినిమాలో ఒక కుక్కకు ఇంజక్షన్ వేస్తే అన్నీ కుక్కలను కరిచి రోగం వ్యాపిస్తుంది. అవే సీన్స్ సూర్యాపేట రోడ్లపై రిపీట్ అవుతున్నాయి. ఆ మూవీలో దర్శకుడు చూపిస్తే.. నిజ జీవితంలోనూ అదే విధంగా.. ఏ వీధిలో చూసిన కుక్కలు గజ్జి లేసి, వింత చర్మవ్యాధులతో సైర విహారం చేస్తున్నాయి.

వీధి శునకాల గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న కూడా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కుక్కల వల్ల రోజూ సాయంత్రం కాగానే పిల్లలు, పెద్దలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. పిల్లలల్ని, పెద్దలని కరిచిన  వింతవ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మాములుగా ఉన్నప్పుడే ఈ వీధి కుక్కుల ప్రజలపైకి ఎగబడుతున్నాయని అంటున్నారు. ఇక వింత రోగం(Mystery Diseases)తో తిరుగుతూ ఏ క్షణాన దాడి చేస్తాయోనని ప్రాణాలు అరిచేత పట్టుకుని తిరుగుతున్నామని వాపోతున్నారు. సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

READ LATEST TELUGU NEWS : దేశంలోనే మొట్టమొదటి అండర్‌వాటర్ మెట్రో ప్రారంభం

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS