మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ (Kotappakonda Temple) వెళ్లే గరళకంఠుడి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ సేవా కేంద్రాలను మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. త్రికూటేశ్వర స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వెళ్తున్న భక్త జనుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
అలాగే భక్తుల ఆకలి తీర్చేందుకు పలువుర్ని ప్రొత్సహించి ఎక్కువ సంఖ్యలో అన్నదాన కేంద్రాలు ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేయించారు. చిలకలూరిపేటలో మూడు ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో కాకతీయ సేవా సమితి, అడ్డరోడ్ సెంటర్‌లో జనసేన, పురుషోత్తపట్నంలో స్థానికులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
మద్దిరాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా అల్పాహారం, భోజనాలు వడ్డించారు. అలాగే పులిహోర, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ధర్మాలన్నింటిలో అన్నదానమే గొప్పధర్మమని… శివభక్తులకు ఈ సౌకర్యాలు కల్పించామన్నారు. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుందని తాము విశ్వసిస్తామని పుల్లారావు అన్నారు.
శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ(Kotappakonda Temple)కు వెళ్లే భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను, పట్టణ ప్రముఖులను ఆయన అభినందించారు. ప్రభుత్వం శివరాత్రి ఏర్పాట్లలో శ్రద్ధ చూపని కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
READ LATEST TELUGU NEWS : శివుడికి తులసీ, కుంకుమలతో పూజలు వద్దు