Monday, June 16, 2025
Homeఆయన ఐటీ రారాజు.. కూతురు బ్రిటన్ ప్రధాని భార్య.. కానీ ఎంతో సింపుల్

ఆయన ఐటీ రారాజు.. కూతురు బ్రిటన్ ప్రధాని భార్య.. కానీ ఎంతో సింపుల్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు.. ఇదిగో వీళ్లలాగా

– By CORRESPONDENT

ఆయన ఐటీకి రారాజు.. కుమార్తె బిటన్ ప్రధాని భార్య. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వారు తప్పక పాటిస్తారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు. అందుకు నిదర్శనమే కింద కనిపిస్తోన్న ఈ ఫోటో.

బెంగళూరులోని జయనగరలో ఉన్న కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్ పార్లర్ రోజూ లాగానే జనాలతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు అతిథులు సాధారణ కస్టమర్లలా ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తింటున్నారు. అయితే ఆ సమయంలో వాళ్లను అక్కడ చూసిన దేవీసింగ్ అనే వ్యక్తి ఆ తండ్రీ కూతుళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్లు.. సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు ఇంగ్లండ్ ప్రథమ మహిళ అక్షతమూర్తి (Akshata Murthy) మరొకరు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి (Infosys Narayana Murthy). వారిని చూసి అవాక్కైన దేవీసింగ్ వెంటనే ఫోన్ తీసి ఓ ఫోటో క్లిక్‌మనిపించాడు. తండ్రీకూతుళ్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఫోటోను అతడు ఎక్స్-ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరలవుతోంది.

బ్రిటన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా అక్షితా మూర్తి గుర్తింపు సంపాదించారు.. ఇక నారాయణ మూర్తి తన ఇన్ఫోసిస్ సంస్థ, ఫౌండేషన్‌తో కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. వారు ఎంతో ధనవంతులు.. వీరి జీవితం మాత్రం ఎంతో నిరాడంబరం అంటూ ఆ వ్యక్తి ఫోటో కింద రాసుకొచ్చారు.

కాగా.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి జీవిత చరిత్రపై ఓ పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషిసునాక్(Rishi Sunak) సతీమణి అక్షతమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత చిన్నప్పుటీ నుంచి తను ఎంతో ఇష్టపడే ఐస్‌క్రీమ్‌ను తండ్రితో కలిసి తిన్నారు. దీంతో ఈ ముచ్చట కాస్త నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

READ ALSO: చిన్నప్పటి స్నేహితుడి కోసం ధోని ఏం చేశాడో తెలుసా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS