Monday, December 23, 2024
HomenewsLoksabha First Phase Polling : మొదలైన తొలి దశ పోలింగ్

Loksabha First Phase Polling : మొదలైన తొలి దశ పోలింగ్

DELHI : దేశంలో లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 35.67 లక్ష మంది ఫస్ట్ ఓటర్స్ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ (60) సిక్కిం (32) రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. మొదటి విడుతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, మధ్య ప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్,లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరుగుతున్నాయి.

చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎంలు పళనిస్వా మి, పన్నీర్ సెల్వం, రామాంతపురంలో ఓటేశారు. శివగంగలో కాంగ్రెస్ నేత చిదంబరం, ఉత్తుపట్టిలో తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామ లై,సాలిగ్రామంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. సినీ నటులు రజనీ కాంత్. అజిత్ కుమార్, ఎమ్ఎన్ఎమ్ అధినేత కమల్ హాసన్ లు చెన్నైలో ఓటు వేశారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, త్రిపుర సీఎం మాణిక్ సాహా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ని తమ తమ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకు న్నారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఐజ్వాల్లో ఓటువేశారు. ఇక మహారాష్ట్రనాగుర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరులో, బాబా రామేవ్, పతంజలి ఆచార్య బాలకృష్ణ ఉత్తరాఖం డ్ లోని హరిద్వార్ లో ఓటు వేశారు. ఇక ఉదయ్యం 11గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదు అయింది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS