Saturday, December 21, 2024
HomeMega DSC: 11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Mega DSC: 11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 11,062 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ అధికారులు, మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు.

పోస్టుల వివరాలు:
స్కూల్ అసిస్టెంట్ – 2629
లాంగ్వేజ్ పండిట్ – 727
ఎస్జీటీ – 6508
పీఈటీ – 182
ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు- 220
ఎస్జీటీ ( స్పెషల్ ఎడ్యుకేషన్ )- 796

దరఖాస్తు విధానం.. ముఖ్యమైన తేదీలు

గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు మెగా డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అప్లికేషన్ ఫీజు రూ.1000గా నిర్ణయించారు. అభ్యర్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 46 ఏళ్లుగా నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.

Mega DSC Notification Released in Telangana
Mega DSC Notification 2024

కాగా గతేడాది 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దూ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను పెంచి తాజాగా మెగా డీఎస్సీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

READ Latest Telugu News : వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS