Dharani Special Drive : ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌తో ధరణి సమస్యలు ఒక్కొక్కటీ కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. ఎమ్మార్వో స్థాయిలో మార్చి 9 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 6 రోజుల్లోనే 76వేలకు పైగా ధరణి సమస్యలను పరిష్కరించామని వివరించారు
గత ప్రభుత్వ హయాంలో లక్షలాది సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. వీటిని పరిష్కరించేందుకు ఎమ్మార్వోస్థాయి అధికారులతో ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని త్వరలోనే దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
READ LATEST TELUGU NEWS : గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీకి మీరు అర్హులేనా?