Wednesday, March 19, 2025
HomeFree Bus For Women : మహిళలకు ఫ్రీ బస్ పథకంపై ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ప్రశ్న

Free Bus For Women : మహిళలకు ఫ్రీ బస్ పథకంపై ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ప్రశ్న

అభయహస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీంలో మహిళలకు ఉచిత ప్రయాణం(Free Bus For Women)పై కల్పించారు. ఈ పథకంపై ఇటీవల నిర్వహించిన ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఒక క్వశ్చన్ అడిగారు.

ఆ ప్రశ్న ఏంటంటే.. ‘ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని(Free Bus For Women) అనుమతించే పథకం గురించి కింది వాటిలో ఏవి సరైనవి కావు? అంటూ’ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ విషయం ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకంపై వచ్చిన ప్రశ్న ఇది. మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!?’ అంటూ క్వశ్చన్ పేపర్ ఫోటోను షేర్ చేస్తూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

READ LATEST TELUGU NEWS: వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS