Thursday, April 24, 2025
HomeThe Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ

The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది గోట్ లైఫ్… ఆడు జీవితం. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష(The Goat Life Review)లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథగా చెప్పుకుంటే 90వ దశకంలో మోసానికి గురై ఎడారిలో గొర్రెలను మేపే పనిలో పడి నరకం లాంటి జీవితాన్ని గడిపి దాని నుంచి తప్పించుకున్న ఒక కేరళ వ్యక్తి తిరిగి భారతదేశానికి ఎలా వచ్చాడు అనేది సింపుల్‌గా అనిపిస్తుంది.

కానీ దానికి ఒక దృశ్య రూపకం ఇవ్వడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి. నిజానికి ఇది ఒరిజినల్ గా జరిగిన కథ. నజీబ్ అనే వ్యక్తి జీవిత కథను కేరళలో నవలగా రాస్తే కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.

దీంతో ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ఎంతోమంది స్టార్ హీరోలు ప్రయత్నం చేశారు. చివరికి అక్కడ స్టార్ హీరోగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా(The Goat Life Review)ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే సాహసానికి పూనుకున్నారు.

ఆడు జీవితం (The Goat Life Review) సినిమా కథ చెప్పుకుంటే ఎన్నో వర్ణనలు, ఇంకెన్నో వర్ణనాతీతమైన బాధలు, ప్రేక్షకులను ఒక ఊహా లోకంలోకి తీసుకువెళ్లే పదప్రయోగాలు చేయవచ్చు. కానీ ఈ సినిమాని విజువలైజ్ చేయటం అనేది పెద్ద సాహసమే.

అయితే ఆ సాహసాన్ని పృథ్వీరాజ్ చాలా సునాయాసంగా చేసినట్లు కనిపించినా అతని కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. చెప్పుకోవడానికి ఇది కథ కాదు వ్యధ అని సింపుల్గానే చెప్పేసినా ఆ వ్యధను ప్రేక్షకులకు చేర వేయడంలో పృథ్వీరాజ్ వందకి వంద మార్కులు సంపాదించాడు అని చెప్పొచ్చు.

కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా కేవలం జరిగిన కథను.. సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకోవడం అభినందనీయం. సినిమాటిక్ లిబర్టీ కొన్నిచోట్ల తీసుకున్నారు అనిపించినా ఫైనల్‌గా అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా(The Goat Life Review) మొత్తం పృధ్వీరాజ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇతర నటీనటులు ఉన్నా సరే మేజర్ పార్ట్ మనం పృథ్వీరాజ్‌ను మాత్రమే చూస్తూ ఉంటాం.

అతని నటన మేకోవర్ అనితర సాధ్యం అనే విధంగా పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. అతని నటనకి అవార్డులు వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆఫ్రికన్ వ్యక్తిగా కనిపించిన హాలీవుడ్ నటుడు, హకీం పాత్రలో నటించిన గోకుల్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.

అమలాపాల్(Amala Paul) పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ సినిమా(The Goat Life Review) మొత్తాన్ని ఫ్రేమ్, ఫ్రేమ్ కి తన పనితనం చూపించాడు.

రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి బాగా సెట్ అయి సినిమాకి హైలైట్ అయింది. డైరెక్టర్ బ్లేస్సీ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

నిడివి బాగా ఎక్కువ అనిపిస్తుంది ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కానీ చెప్పాల్సిన విషయం ఎక్కడ డైల్యూట్ అవుతుందో అని భావించినట్లు ఉన్నారు.

ఫైనల్‌గా చెప్పాలంటే ఆడు జీవితం-ది గోట్ లైఫ్(The Goat Life Review) ఒక ప్రయోగం లాంటిది. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చదు. సినీ ప్రేమికులకు, మేకింగ్ ఇష్టపడే వారికి మాత్రమే కనెక్ట్ అయ్యి నచ్చే సినిమా ఇది.

READ LATEST TELUGU NEWS: ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీ రివ్యూ

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS