తెలంగాణలో పదో తరగతి (SSC Exams) పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్ఎస్‌సీ బోర్డు సూచించింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2, 676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది.
అయితే ఈ సమయంలో పరీక్షలు (SSC Exams) జరిగే కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్‌గా బోర్డు ప్రకటించింది. పరీక్ష సిబ్బంది… స్క్వాడ్స్‌తో సహా ఎవరూ కూడా సెల్ ఫోన్ వాడటం నిషేధమని ఆదేశాలు జారీ చేసిది. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు.. సస్పెండ్ చేస్తామని ఎస్ఎస్‌సీ బోర్డు హెచ్చరించింది. గత ఏడాది జరిగిన సంఘటనల దృష్ట్యా విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
READ LATEST TELUGU NEWS: గ్రూప్-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ ఓసారి చూడండి