Disha Patani With Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు. ఇందులో హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దిశా, ప్రభాస్‌పై ఓ రొమాంటిక్ పాట ఉండబోతోందట. ఈ పాట షూటింగ్ మొత్తం ఇటలీలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, దిశ విమానంలో ప్రయాణిస్తుండగా.. దిశా ప్రభాస్ ఫోటోను క్లిక్‌మనిపించారు.
కల్కి 2898 ఏడీ (KALKI 2898 AD)సినిమాలో ప్రభాస్ కాస్త కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ లేటెస్ట్ షూటింగ్ పిక్ బయటికి రావడంతో ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. ప్రభాస్‌ను కొత్తగా చూపించిన వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత నాగ్ అశ్వినే అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.