BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా)
ధరణి వెబ్ సైట్ లో ఎదురవుతున్న సమస్యలు వాటిలో ఉన్న లోపాలు, ప్రజల నుంచి అందుతున్న పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి వివరాలు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు, ప్రభుత్వం అన్ని మాడ్యూల్ల లోని వివిధ సమస్యల వివరాలను సంబంధిత శాఖ నుండి సమగ్రమైన నివేదిక సమర్పించాలని తెలిపింది.
ధరణిలో దాదాపుగా 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం వీటితో పాటు అన్ని రకాల భూముల వివరాలు అందజేయాలని ఈనెల 21న వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.