ఏడాదిలోనే 2 లక్షల కొలువులిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీని పునరుద్దరించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్కతో కలిసి కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో కె. హబ్, పీవీ నాలెడ్జ్ సెంటర్‌లను ఆయన ప్రారంభించారు.
అనంతరం కాకతీయవర్సిటీ(Kakatiya University)లో హాస్టళ్లు, డైనింగ్ హాల్, క్యాంపస్ చుట్టూ కాంపౌండ్ వాల్, తదితర నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కాకతీయ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం వర్సిటీకి కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదు. ఇప్పుడు ప్రాకారానికి శంకుస్థాపన చేశాం. కేయూ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. వర్సిటీ భూములను ఎవరైనా అక్రమించినట్టు తేలితే కఠిన చర్యలు చేపడుతాం. తెలంగాణ వచ్చిన తర్వాత కాకతీయ వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం మేమే’ అని మంత్రి తెలిపారు.
READ LATEST TELUGU NEWS : బీఆర్ఎస్‌తో కూటమిపై ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్